TG: గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమనే విషయాన్ని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ నేతృత్వంలో తాము బనకచర్లపై అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
Post Views: 58







