AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే పీవీఎన్ మాధవ్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మంగళవారం ఉ.11 గంటలకు పార్టీ ఎన్నికల అధికారి పాకా వెంకట సత్యనారాయణ అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరిని మరోసారి కొనసాగించేందుకు అధిష్టానం మొగ్గు చూపలేదు.
Post Views: 89








