Mahaa Daily Exclusive

  ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం: కవిత

Share

గోదావరి-బనకచర్లకు కేంద్రం నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతి నిరాకరించడం హర్షణీయమని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయంగా ఆమె అభివర్ణించారు. చంద్రబాబుతో చేతులు కలిపి జలదోపిడీకి ద్వారాలు తెరిచిన సీఎం రేవంత్ ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయాలని కవిత పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.