Mahaa Daily Exclusive

  పాశమైలారం ప్రమాద ఘటన.. ప్రభుత్వ కమిటీ ఏర్పాటు..!

Share

TG: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో సహాయకచర్యల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా డీఆర్‌ఎఫ్‌ స్పెషల్‌ సీఎస్‌, కార్మిక శాఖ సీఎస్‌ను నియమించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయనుంది.