ప్రధాని మోదీ విదేశీ పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 2 నుంచి 9 వరకు ఆయన ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలకు వెళ్లనున్నారు. మూడు దశాబ్దాల తర్వాత ప్రధాని ఘనాలో పర్యటించనుండగా, ట్రినిడాడ్‌కు 1999 తర్వాత ప్రధాని పర్యటన ఇదే మొదటిసారి. జూలై 6, 7 తేదీల్లో బ్రెజిల్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, భారత దౌత్య ప్రయోజనాలపై చర్చించే అవకాశం ఉంది.
Post Views: 100








