Mahaa Daily Exclusive

  నా జీవితంలో నా మీద ఒక్క కేసు కూడా కాలేదు: చంద్రబాబు

Share

AP: తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. తన జీవితంలో తనపై ఒక్క కేసు కూడా లేదని తెలిపారు. ఎప్పుడు ఒక వ్యక్తిని కొట్టింది లేదన్నారు. కానీ ఇప్పుడు నేరస్తులతో రాజకీయం చేయాల్సి వస్తుందని, చేయకపోతే ప్రజలు అన్యాయం అయిపోతారని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా వెళ్తున్నామన్నారు.