AP: గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న 1,659 మంది ఔట్ సోర్సింగ్ టీచర్లకు భారీగా జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ లెక్చరర్లు, పీడీ (సి), లైబ్రేరియన్ల వేతనానికి అదనంగా రూ.18 వేలు నుంచి రూ.24,150 పెంచింది. పీజీటీల వేతనానికి అదనంగా రూ.16,100 నుంచి రూ.24150 పెంచింది. టీజీటీ, పీడీ (ఎస్) వేతనానికి అదనంగా రూ.14,800 నుంచి 19,350 పెంచింది. పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ మ్యూజిక్ సిబ్బందికి రూ.16,300 వరకు అదనంగా వేతనం పెంచింది.
Post Views: 52








