వరంగల్ మహా;
రైతులకు ఎరువులు, అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు.
శుక్రవారం వరంగల్ జిల్లా సంగెo మండలం గవిచర్ల గ్రామంలో వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీలో ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువుల నిలువలు, స్టాకు రిజిస్టర్లు, గోదాం, తూకం యంత్రాలు, రసీదు పుస్తకాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఎరువులు, నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలని సూచించారు. దుకాణం ముందు స్టాకు నిల్వ, ధరల పట్టిక వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని, యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని ఆదేశించారు. ఎరువులు విత్తనాలు అధిక ధరలు విక్రయిస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు అవసరం మేరకు యూరియా వాడాలని, అధిక నిల్వలు చేసుకోకూడదని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యాకయ్య, తహసీల్దార్ రాజ్ కుమార్, పిఏసీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








