వరంగల్ మహా;
వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్య 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బ శ్రీనివాస్ ఆర్యవైశ్య జిల్లా మహాసభ కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చెన్నై గవర్నర్ అనేకసార్లు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కీర్తిశేషులు రోశయ్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రోశయ్య జయంతిని అధికారికంగా చేయాలని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనేక పేద సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందజేసిన చరిత్ర రోశయ్య దని కొనియాడారు.
అనంతరం స్థానిక ప్రజలకు, కార్మికులకు వివిధ రకాల పండ్లు, పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు, ఉపాధ్యక్షులు సదాశివుడు, శ్రీనివాస్, వీరభద్రయ్య, సోమా అశోక్, యుత్ విభాగం అధ్యక్షుడు యాద రవికుమార్, సోమ సాయి, అనంతల వీరేందర్, శ్రీరామ్, రవీందర్, మెతుకు శంకర్, మునిగిటి సంతోష్, శివ, పాల్గొన్నారు.








