హన్మకొండ మహా;
కాజీపేట తహసీల్దార్ కార్యాలయాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయం లోని రికార్డుల గదిని పరిశీలించారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గురించిన వివరాలను కలెక్టర్ తహసీల్దార్ భావు సింగ్ ను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, సర్వేయర్, ఆర్ఐ లతో రెవెన్యూ సంబంధిత అంశాల పై కలెక్టర్ మాట్లాడారు. అనంతరం
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేశారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్ధార్ ప్రణయ్ కుమార్, ఆర్ఐ లు, కార్యాలయ ఉద్యోగులు, ఉన్నారు.
Post Views: 60








