Mahaa Daily Exclusive

  సంఘాలకు అండగా.. నిధులు దండిగ ఒక్కో సంఘానికి రూ.5లక్షల చొప్పున రూ.50లక్షలు మంజూరు -నాయకులకు ప్రొసిడింగ్ కాపీలు అందించిన కంది శ్రీనివాస రెడ్డి..!

Share

ఆదిలాబాద్, మహా

కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాలకు అండగా నిలిచింది. ఆయా సంఘాల కమ్యూనిటీహాల్ ల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన కోసం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డికి ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్ డీఎఫ్) రూ.10కోట్లు కేటాయించగా.. ఇందులో నుంచి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరు చేసింది. కంది శ్రీనివాస రెడ్డి నియోజకవర్గంలోని పది కులాల సంఘాలకు గాను ఒక్కోదానికి రూ.5లక్షల చొప్పున రూ.50లక్షల నిధులు కేటాయించారు. మున్నూరు కాపు, రెడ్డి, రజక, ముదిరాజ్, నాయి బ్రాహ్మణ, గంగపుత్ర, మాదిగ, మాల, గోండ్, లంబాడ కుల సంఘాల భవనాల్లో వివిధ రకాల మౌళిక వసతులు కల్పించేందుకు కేటాయించారు. తాజాగా ఆయా సంఘాల నాయకులకు కంది శ్రీనివాస రెడ్డి ప్రజాసేవా భవన్ లో ఆదివారం ప్రొసిడింగ్ కాపీలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. పేదలు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తోందని గుర్తు చేశారు. ఈ నిధులు మంజూరు కావడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రస్తుత జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. వారి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ కృషి గొప్పది

కమ్యూనిటీ హాళ్లలో చేపట్టనున్న వివిధ అభివద్ధి పనుల నిమిత్తం కంది శ్రీనివాస రెడ్డి నుంచి ప్రొసిడింగ్ కాపీలు అందుకున్న ఆయా కుల సంఘాల నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాల అభ్యున్నతి కోసం నిధులు మంజూరు చేయడం హర్షనీయమన్నారు. ఇందుకు కృషి చేసిన కంది శ్రీనివాస రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడంలో ప్రజా సేవా భవన్ సందడిగా మారింది.