ఆదిలాబాద్, మహా
పేద,బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఆదివారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భావన్ లో లబ్ధిదారులకు అందించారు. రూ. 3.26లక్షల విలువ గల ఎనిమిది మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బొక్కలగూడ కు చెందిన అర్షియా అంజుమ్ కు రూ. 60వేలు, లాండసాంగ్వికి చెందిన బుద్దె వందన కు రూ. 28వేలు, యాపల గూడకు చెందిన సౌజన్య కు రూ. 26,500, కౌట గ్రామానికి చెందిన సురేఖ కు రూ. 60వేలు, వాఘాపూర్ కు చెందిన జ్యోతి కి రూ. 24వేలు, మసూద్ నగర్ కు చెందిన నఫీస్ ఫాతిమా కు రూ.60వేలు, తాటిగూడ కు చెందిన సునైద్ కు రూ.42, 500 ,వాఘాపూర్ కు చెందిన యాదమ్మ కు రూ.25వేలు విలువ గల చెక్కులను అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. సీఏం ఆర్ ఎఫ్ నిధుల సహాయం కోసం తన క్యాంపు కార్యాలయం లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని ఆసుపత్రుల్లో డబ్బుల పెట్టి వైద్యం చేయించుకున్నవారికి ముఖ్య మంత్రి సహాయ నిధినుండి ఆర్థిక సాయంకోసం దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు. తను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెక్కులు విడుదలయ్యేలా కృషి చేస్తానన్నారు. అటు చెక్కులు తీసుకున్న వారు ప్రభుత్వానికి, కంది శ్రీనివాస రెడ్డికి ధన్యవాదాలు తెలిసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు







