ఆదిలాబాద్, మహా
పెంపుడు జంతువుల నుండి వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని పశు సంవర్ధక శాఖా సహాయ సంచాలకులు డాక్టర్ గోపికృష్ణ సూచించారు. ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా పట్టణంలోని పశు వైద్య శాలలో ఆదివారం శునకాలకు రేబిస్ టీకాలను వేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గోపికృష్ణ మాట్లాడుతూ…. ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ మొదటిసారిగా యాంటి రేబిస్ టీకాను కనుగొన్న రోజునే జునోసిస్ డే గా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా శునకాలకు యాంటి రేబిస్ టీకాలను పశు సంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. పెంపుడు జంతువుల మలమూత్రంతో పాటు వారి సలైవాకు దూరంగా ఉంటే వ్యాధులు వచ్చే ఆస్కారం ఉండదని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు దూద్ రామ్ రాథోడ్, గజానన్, రజనీకాంత్, పద్మ, ఖాజాపాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 57







