వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎల్బీనగర్ మోమిన్ పురా లో మొహరం వేడుకలు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు సయ్యద్ వసీం, ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీరీల వద్ద ప్రార్థనలో మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ
ముస్లిం క్యాలెండర్ ప్రకారం ఈ మొహరం నెల ముస్లింలకు నూతన సంవత్సరం మొదలవుతుందని
ఈ పండుగ గొప్ప చరిత్రకు నిదర్శనమని అన్నారు.
మహమ్మద్ ప్రవక్త మనవళ్లు అయన హాసన్,
ఇమామ్ హుస్సేన్ ధర్మం కోసం న్యాయం కోసం విముక్తి కోసం జరిగే పోరాటంలో తన ప్రాణాలను విడిచారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ముస్లిం మతస్తులు మొహారం మాసంలో దుఃఖాన్ని బాధను స్మరించుకుంటారని ముఖ్యంగా
ఈ మాసంలో ముస్లింలందరూ 7,8,9,10, తేదీ లలో ఇమామ్ హుసైన్ మరణాన్ని స్మరించుకుంటూ బాధలో ఉపవాసం కూడా ఉంటారని తెలిపారు.
వరంగల్ తూర్పు లో ముస్లింలు ఎక్కువ శాతం ఉన్నారని కాబట్టే ఈ పండుగ ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని
మొహరం పండుగ సందర్భంగా పీరీలను తిలకించడానికి కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు కలిసి ప్రార్థనలు చేయడం ఎంతో అభినందనీయం అన్నారు.







