హన్మకొండ మహా;
తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం హనుమకొండ లోని ప్రాచీన ప్రసిద్ధి గాంచిన వెయ్యిస్థంభాల ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారి సతీమణి నాయిని నీలిమ రెడ్డి తో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే దంపతులు
భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ, వారితో కలిసి భక్తిపూర్వకంగా మమేకమయ్యారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 96







