బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని క్యాబినెట్ సమావేశంలో ఇవాళ ప్రకటించారు. దీనివల్ల ప్రభుత్వ సర్వీసుల్లో స్త్రీల ప్రాతినిధ్యాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు, శిక్షణ ఇచ్చేందుకు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.








