Mahaa Daily Exclusive

  తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించ్చిన పోలీసులు సుబేదారి ఇన్స్పెక్టర్ యం రంజిత్ కుమార్ ..!

Share

హన్మకొండ మహా;

తాడిచర్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు చెందిన ఉల్లిగంటి. సంపత్ కుమార్తె అయిన శ్రీ నిత్య 9 సంవత్సరాలు హనుమకొండ హంటర్ రోడ్ లో గల టిజిఎస్యూఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్ లో 5వ తరగతి చదువుతుంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హాస్టల్లో నుండి శ్రీ నిత్య అకస్మాత్తుగా బయటికి వెళ్లిపోయింది. ఇదే హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అయిన బైరి ఉమా పాప లేదని తెలిసి ఎంత వెతికినా కనిపించకపోగా సుబేదారి ఇన్స్పెక్టర్ యం రంజిత్ కుమార్ కు తెలిపారు. వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ రంజిత్ తన సిబ్బందితో కలిసి సీసీ కెమెరాలు పరిశీలించగా పద్మాక్షమ్మ గుట్ట దగ్గర ఉందని తెలుసుకుని తన సిబ్బందితో పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి శ్రీ నిత్య తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ కుమార్తెను అప్పగించినందుకు సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ కు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు.

Latest