Mahaa Daily Exclusive

  సమస్యల పరిష్కారానికి ఐక్యంగా సాగుదాం..!

Share

ఆదిలాబాద్, మహా

బస్సుల యజమానులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండి ముందుకు సాగుతామని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మల్లేశం కోరారు. హైదరాబాద్ నుండి వచ్చిన అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు స్థానిక టీ ఎన్జీఓ భవన్ లో శనివారం సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించారు. జిల్లా అసోసియేషన్ సభ్యులతో కలిసి సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణ పై చర్చించారు. అనంతరం జిల్లా సభ్యులతో రాష్ట్ర అసోసియేషన్ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ బస్సుల యజమానులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కారానికి గానూ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా సభ్యులను చేర్చుకున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా నుండి కలుపుకుని పోతూ ఐక్యంగా ఉంటూ పోరాడతామని తెలిపారు. ఉపాధి కరవై అనేక ఇబ్బందులు పడుతున్నామని, ట్యాక్స్ లు చెల్లించేందుకు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లాల పర్యటన చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమం లో ట్రావెల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి, ప్రధాన కార్యదర్శి సౌకత్ హుసేన్, ఇమ్రాన్, మహేందర్, పాషా, సదక్ అలీ, ఉరాడే సుభాష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.