Mahaa Daily Exclusive

  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పై ఆరోపణలు ఖండించిన జిల్లా నేతలు ..!

Share

వరంగల్ మహా;

భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షలు పిలుపుమేరకు
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పై చేసిన అసత్య ఆరోపణల కు గాను వరంగల్ బిజెపి సీనియర్ నేతలు రామచంద్రరావు కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పోస్ట్ ఆఫీస్ చౌరస్తా లో వరంగల్ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బట్టి విక్రమార్క దళిత ద్రోహి అని అంబేద్కర్ ను అవమానించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని వెంటనే రాష్ట్ర అధ్యక్షుడికి క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో బట్టి విక్రమార్క ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి నోరు అదుపులో పెట్టుకోకపోతే రానున్న ఎలక్షన్ లో మీకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అనంతరం మోర్చా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రం పై అనుచిత వాక్యాలు చేసిన బట్టి విక్రమార్క దళిత ద్రోహి అని వేముల రోహిత్ అనే వ్యక్తి దళితుడు కానే కాదని, రానున్న స్థానిక ఎలక్షన్ల కోసం ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ , రత్నం సతీష్ షా, డాక్టర్ వన్నాల వెంకటరమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, ఉపాధ్యక్షులు రఘునారెడ్డి, కనుకుంట్ల రంజిత్, బైరి శ్యామ్, కుచన క్రాంతి, ఎస్సీ మోర్చా హన్మకొండ జిల్లా అధ్యక్షులు సండ్ర మధు, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పోలెపాక జనార్దన్, జిలకర వీరస్వామి, దామెర సదానందం, మైదం వీరస్వామి, ఊసిల్ల దయాకర్, తగరపు బాబు, మేకల రాజు, గబ్బెట ప్రవీణ్, సౌరంరాజు, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.