Mahaa Daily Exclusive

  రైతుల భూమి జోలికొస్తే ఖబడ్దార్ బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ గోశాలకి మేము వ్యతిరేకం కాదు సామాన్య రైతులు నష్టపోవొద్దు..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మొయినబాద్ మండలం యెనికే పల్లి గ్రామ రైతులు గత కొన్ని రోజులుగా చేపట్టిన ఆందోళనకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. రైతుల భూములు తీసుకొని గోశాలకి కేటాయించడం కన్నా మరోచోట ఉపయోగంలో లేని భూములు కేటాయించాలని అన్నారు. ఎన్నో రోజులుగా సాగుచేసుకుంటున్న రైతుల నుండి ఉన్నపళంగా భూములు తీసుకుంటే వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, వారి జీవనాధారం ఎలా అని ప్రశ్నించారు. రైతుని బాధ పెట్టిన ఏ ప్రభుత్వం బాగు పడదు, కొండలు గుట్టలుగా ఉన్న భూములను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సాగు చేసుకుంటున్న రైతులను అర్థాంతరంగా వెళ్లిపోమనడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలి లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తోంది ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Latest