వరంగల్ మహా;
వరంగల్ నగరంలోని ఆటోనగర్ జంక్షన్ లో మట్టేవాడ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బరపట్ల సాయి, తండ్రి పేరు (లేట్) భాస్కర్, కులం: ఎస్సీ మాదిగ, వృత్తి: కూలి, నివాసం పోచమ్మ మైదాన్ అయిన ఇతడు ఇంతే జార్గంజ్, మట్టెవాడ పోలీస్ స్టేషన్ల లో మోటార్ సైకిల్ దొంగతనం, కిరాణం షాపులలో, ఇండ్లలో, బార్ షాపులో దొంగతనం చేసి తిరుగుచుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కొద్దిరోజుల క్రితం వరంగల్ అండర్ బ్రిడ్జి దగ్గరలో ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసి దానీ పై తిరుగుతూ ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడని అలాగే దేశాయ్ పేట రోడ్ లో గల 60 ఫీట్ రోడ్ వద్ద దొంగతనం చేసిన మోటార్ సైకిల్ తో యాక్సిడెంట్ చేసి అట్టి వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఈనెల 10వ తేదీ సాయంత్రం దేశాయ్ పేట రోడ్ లో గల ఉమా బుక్ స్టాల్ వద్ద ఉన్న మోటార్ సైకిల్ దొంగతనం చేసి ఇంకా కొన్ని నేరాలు చేయడానికి ప్రయత్నం చేసి తిరుగుతుండగా సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతడు గతంలో వివిధ పోలీస్ స్టేషన్లో చాలా నేరాలు, దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభవించి గత నెల క్రితం జైలు నుంచి రిలీజ్ అయి వివిధ నేరాలలో పాల్గొన్నాడు. ఇతని వద్ద ఉన్న మోటార్ సైకిల్ ను సీజ్ చేసి, నిందితున్ని కోర్టులో హాజరు పరిచామని మట్టేవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపిరెడ్డి తెలిపారు.








