Mahaa Daily Exclusive

  శ్రీమద్ భాగవతం సినిమా చేపట్టడం సంతోషం సమతుల్య విధానంతో నేడు శ్రీమద్ భాగవతం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం -రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Share

రంగా రెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

రామాయణం, మహాభారతం కథలు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చినందున, సమతుల్య విధానంతో నేడు శ్రీమద్ భాగవతం సినిమా నిర్మాణాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.
సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం పార్ట్-1 సినిమా నిర్మాణ షూటింగ్‌ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 40 సంవత్సరాల క్రితం రామాయణ సీరియల్‌లను చిత్రీకరించి టెలివిజన్‌లో ప్రసారం చేసిన రామానంద్ సాగర్ ఒక చిరస్మరణీయ వ్యక్తి అని, ఆ సీరియల్ సమయంలో ఎవరూ రోడ్లపై ఉండేవారు కాదని, అందరూ ఆ సీరియల్ చూసేవారని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాను చిత్రీకరించిన రామానంద్ సాగర్‌కు సంబంధించిన మోతీసాగర్, అమృత్ ఆకాష్ లు ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మహా భాగవతం పార్ట్-1 సినిమా నిర్మాణాన్ని చిత్రీకరించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. రామాయణం సీరియల్ లాగానే ఈ భాగవతం మహాభారత చిత్రం కూడా అందరి ప్రశంసలు పొంది విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అన్ని సహాయ, సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతమైన చిత్రాలను నిర్మించడంలో అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకుందని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్, భగవత్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ మోతీసాగర్, అమృత్‌సాగర్ చోప్రా, ఆకాష్‌సాగర్, రామోజా ఫిల్మ్ సిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Latest