దమ్మపేట /ములకలపల్లి ,జూలై 16 మహా :
అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో పూర్తైన తిమ్మంపేట ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార ,పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు ,టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు , స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా తిమ్మంపేటతో పాటు పరిసర గ్రామాలలో వందలాది ఎకరాలు సాగులోకి రానున్నట్టు తెలిపారు. పంటభూములకు నిరంతరాయంగా సాగునీరు అందనుండగా వర్షాధారంగా సాగుచేస్తున్న రైతులకు తిమ్మంపేట ఎత్తిపోతల పథకం అందుబాటులో కి రావడంతో రైతులకు ఉపశమనం కానుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రెండు పంటలకు పుష్కలంగా నీరందటం వల్ల ఆర్థికంగా రైతులు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ తిమ్మంపేట ఎత్తిపోతల పథకం అనేది ఈ ప్రాంత రైతుల కల అని ఇది సాకారం కావడం నియోజకవర్గానికి గర్వకారణమన్నారు .సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల కృషితో నిధులు మంజూరు చేయడంతో తిమ్మంపేట ఎత్తిపోతల పథకం సాధ్యమయ్యిందన్నారు .
ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.








