మధిర,జూలై16(మహ)
జిల్లా వ్యవసాయ అధికారి ఖమ్మం డి. పుల్లయ్య మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో పత్తి పంట పరిశీలించడం జరిగింది. సిరిపురం గ్రామంలో నానో యూరియా క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నానో యూరియా వాడకం వలన మొక్కకు పోషకాలు ఎక్కువ మోతాదులో అందుతాయని, నానో యూరియా వాడకం వలన ఖర్చు తక్కువగాను, నానో యూరియా వాడటం వలన పర్యావరణ కాలుష్యం తక్కువగా ఉంటుందని, నానో యూరియాను ఎంపిక చేసిన కలుపు మందులలో కలిపి పిచికారి చేయవచ్చునని రైతులకు వివరించడం జరిగింది. అలాగే మధిర రైతు వేదికలో ఈరోజు ఏఈఓ, ఏ ఓ లకు ఆయిల్ పామ్ పంటపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ విజయ్ చంద్ర , వ్యవసాయ అధికారి కే సాయి దీక్షిత్ , వ్యవసాయ విస్తరణ అధికారులు వేణు, గురుమూర్తి మరియు రైతులు పాల్గొన్నారు.








