Mahaa Daily Exclusive

  దివ్యాంగులకు పెండింగ్ పెన్షన్లు మంజూరు చేయాలి..!

Share

ఆదిలాబాద్, మహా

దివ్యాంగులకు పెండింగ్ పెన్షన్లను మంజూరు చేయడంతో పాటు కార్పొరేషన్ ను బలోపేతం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు ఎం.నగేష్ డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను వెల్లడిస్తూ నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ… చేయూత పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల పైచిలుకు మంది దివ్యంగులు దరఖాస్తులు చేసుకున్నారని, పెండింగ్ పెన్షన్లు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వికలాంగుల కార్పొరేషన్ ను ప్రభుత్వం బలోపేతం చేసే దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో టీపీసీసీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. చత్తిస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో అమలు చేసిన విధంగా వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీ లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ధర్నాలో పోచన్న, అనసూయ, ప్రియాంక, హరిఫా బేగం తదితరులు పాల్గొన్నారు.

Latest