మిర్యాలగూడ మహా
ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకునే వారికి వారికున్న ఇంటి స్థలాలలోనే ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని సిపిఐ హబ్ బంటు వెంకటేశ్వర్లు
సిపిఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం మిర్యాలగూడ సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిడిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ప్రతిపాదించిన ఇంటి స్థలంలో ఇండ్లు నిర్మాణం చేయాలని ప్రభుత్వ అధికారులు చెప్పటం జరుగుతుంది ఇండ్లు శాంక్షన్ అయిన వారిలో చాలామందికి ఇంటి స్థలం తక్కువ ఉండటం వలన నిర్మాణం చేయలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వారి దగ్గర ఉన్న ఇంటి స్థలంలో నిర్మాణాలు 4 ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇవ్వాలని వారన్నారు గతంలో కీర్తిశేషులు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పుడు వారికున్న స్థలాల్లోని ఇల్లు నిర్మాణం కొరకు పర్మిషన్ ఇచ్చినారని ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆలోచించి కట్టుకునే వాళ్లందరికీ పర్మిషన్ ఇవ్వాలన్నారు. గతంలో ప్రభుత్వం కూడా 90 గజాలు ఇంటి స్థలాలు ఇచ్చిందని దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇండ్ల నిర్మాణం చేసుకునేవారికి వారికున్న ఇంటి స్థలంలో అవకాశం కల్పించాలని వారు అన్నారు అదేవిధంగా నాగార్జునసాగర్ డ్యాంలోకి 566 అడుగుల నీరు వచ్చినాయని వెంటనే సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని వారన్నారు ఎడమ కాలవకు అక్కడక్కడ లైనింగ్ పనులు చేస్తున్నారు, పనులను వెంటనే పూర్తి చేసి సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శులులు అంజన్నపల్లి రామలింగం, జిల్లా యాదగిరి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయ్యద్ మహిళా సమాఖ్య నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు దాసర్ల దుర్గమ్మ ఎర్రబోతు పద్మ డిహెచ్పిఎస్ నియోజకవర్గ కార్యదర్శి వల్లంపట్ల వెంకన్న మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి ఎస్కే.షమీం، మధ్యాహ్నం భోజనం జిల్లా కార్యదర్శి బంటు రాజేశ్వరిలు పాల్గొన్నారు.








