Mahaa Daily Exclusive

  పోలీసు అధికారులు నిరుపేదలకు అండగా నిలవాలి ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలను పెంపొందించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్..!

Share

హన్మకొండ మహా;

ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన శివ కుమార్, వి. నర్సయ్య, వి. చంద్రమౌళి, ఆర్. ఎస్. శర్మ, సాంబయ్యలు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా కు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారుల భుజాల పై నక్షత్రాలను అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ మాట్లాడుతూ
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ప్రజలకు పోలీసుల పట్ల భరోసా నమ్మకాన్ని కలిగించడంతో పాటు, నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పదోన్నతి పొందిన ఎస్ఐలకు సూచించారు.