వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం 27వ డివిజన్ లోని శ్రీ పోచమ్మ దేవాలయం స్టేషన్ రోడ్డు, తో పాటు అబ్బానికుంట నల్ల పోచమ్మ ఆలయాల్లో ఈనెల 30వ తేదీ బుధవారం కుమ్మరి కులస్తులచే తొలి బోనం సమర్పించనున్నారు. ఈ బోనాల ఉత్సవాల ఆహ్వానిక పత్రికను స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించి, పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్, మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ లకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎంతో వైభవంగా నిర్వహించుకునే శ్రావణమాస బోనాలను పురస్కరించుకుని అన్ని దేవాలయాలకు మంత్రి కొండ సురేఖ ఆదేశానుసారం కార్పొరేషన్ వారు ప్రతి దేవాలయం కు రంగులు వేయించడం, విద్యుత్ దీపాలను అలంకరించడం తోపాటు నీటి సౌకర్యం, క్యూలైన్లు, నిర్మాణ మరమ్మతులు చేయించడం పూర్తయిందని ఆలయాలకు శోభ తెచ్చే విధంగా మంత్రి కొండ సురేఖ ప్రత్యేక చొరవ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో కంటే ముందస్తుగా అన్ని పనులు చేయిస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని ఎందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి చరణ్, ఓరుగంటి చిరంజీవి, ఓరుగంటి కుమార్ , ఉపేందర్, వీరలక్ష్మి, మల్లికార్జున్, సాగర్, బజరంగ్, తదితరులు పాల్గొన్నారు.








