కారేపల్లి, మహా:కారేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైరా ఎమ్మెల్యే మాలో రామదాస్ నాయక్ ,జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.పార్టీ కార్యకర్తలు డోలుబాజాల నృత్యాల నడుమ టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.మండల పార్టీ కార్యాలయం ఎదుట భారీ కేక్ కట్ చేసి,స్వీట్లు పంచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాజీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని రాజకీయాలలో నిలబడి ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి చేరవేసేలా కృషి చేస్తానని అన్నారు.అనంతరం భీక్యతండా రైల్వేగేట్ పరిధిలోని వెంచర్ లో ప్రభుత్వ కార్యక్రమం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.అనంతరం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.దేవాలయ సిబ్బంది మూడ్ మోహన్ చౌహాన్ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ను ఆహ్వానించి శాలువాతో సన్మానించారు.ఎమ్మెల్యే పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కారేపల్లి ప్రముఖ వ్యాపారవేత్త జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు సురేందర్ మణియార్ ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తలారి చంద్రప్రకాష్, మహిళా నాయకురాలు పగడాల మంజుల,సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు,డైరెక్టర్లు అడ్డగోడ ఐలయ్య,బానోతు హిరాలాల్, జిల్లా వాణిజ్యవిభాగం ఉపాధ్యక్షులు సురేందర్ మనియార్,ఇమ్మడి తిరుపతిరావు,బానోత్ రామ్మూర్తి నాయక్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేదరి వీరప్రతాప్(టోనీ),మాజీ ఎంపీపీ బానోత్ దేవ్లానాయక్ ,పెద్దబోయిన ఉమాశంకర్,సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్,గుగులోత్ భీముడు నాయక్,ఆలోతు ఈశ్వరి బాయి, టౌన్ ప్రెసిడెంట్ పోలగాని శ్రీనివాస్ గౌడ్,హేమలత,నాగవేణి, సపావట్ నాగులు,ఈసాల ఛాయాదేవి,మాజీ సర్పంచులు వాంకుడోతు కృష్ణ,కురుసం సత్యనారాయణ, ఆంగోత్ మతృ నాయక్,యూత్ ప్రెసిడెంట్ హర్ష నాయక్,మేదరి రాజా,భావుసింగ్, మజీద్ పాషా,తొగర శ్రీను,ఎండి హనీఫ్,ఎంపీడీవో మల్లెల రవీంద్ర ప్రసాద్, ఏపీవో కోటేశ్వరరావు, నరేంద్ర రావు,ఎస్సై బైరు గోపి,వివిధ శాఖల అధికారులు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.







