సత్తుపల్లి, మహా.
సత్తుపల్లి పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారుల డివైడర్లపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ – “వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. వర్షాలు సరైన సమయంలో కురవాలి అంటే ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం అనేది ఈ దిశగా తీసుకున్న మంచి చర్య” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 31







