నేలకొండపల్లి, జూలై 25 మహా:
విద్యార్ధులు మొక్కలు పెంచటం మంచి అలవాటు ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని సెయింట్ ప్రాన్సిన్ పాఠశాల ప్రిన్సిపాల్ మిక్కిలి జోసెఫ్ సూచించారు. మండల కేంద్రంలోని కొత్తకొత్తూరు పాఠశాల కు చెందిన విద్యార్ధి షేక్ కుదుష్యా పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..ప్రతీ పుట్టిన రోజు సందర్భంగా మొక్కను నాటటం చాలా మంచి అలవాటు అన్నారు. పుట్టిన రోజు పేరుతో డబ్బులు వృధా చేయటం..సమయం ను వృధా చేస్తున్న తరుణంలో చిన్నారి మొక్కను నాటే లక్ష్యం ను ఎంచుకోవటం చాలా సంతోషం అన్నారు. చిన్నారి ని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారి తండ్రి షేక్ బాసింసాహెబ్, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 76







