Mahaa Daily Exclusive

  తల్లాడ ఆసుపత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్ శ్రీజ, డిఎంహెచ్ వో కళావతి భాయ్….!

Share

తల్లాడ, జులై,25, ( మహా):-
తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా వైద్య అధికారి కళావతి భాయ్ శుక్రవారం సందర్శించారు. అనారోగ్యంతో మృతిచెందిన యోగా ట్రైనర్ కందుల శ్రీదేవి మృతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ల్యాబును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డాక్టర్ ప్రాథమిక వైద్యులు రత్న మనోహర్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా శ్రీదేవి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట డిప్యూటీ డిఎంహెచ్ వో సీతారాం, ఎంపీడీవో సురేష్ బాబు, తల్లాడ మేజర్ పంచాయతీ కృష్ణారావు, తదితరులు ఉన్నారు.