AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చిన పెట్టుబడులపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులపైన సాక్షి ఛానల్‌లోనే చర్చ పెడితే ఆ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఆదివారం తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రూ.2.5లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన తెలిపారు.
Post Views: 43








