AP: వైసీపీ హయాంలో ప్రతి స్కీమ్ పెద్ద స్కామ్ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయినా జగన్ అండ్ కో అడ్డగోలుగా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. పేదల కష్టాన్ని కరెన్సీ కట్టలుగా మార్చుకుని డెన్‌లలో దాచుకున్నారని, చేసిన పాపం ఊరికే పోదన్నారు. తప్పు చేసిన వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని, లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల అరెస్టులతో కల్తీ మద్యంతో చనిపోయిన వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు.
Post Views: 59








