Mahaa Daily Exclusive

  మంత్రి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం అందించిన రావెళ్ల కృష్ణారావు…!

Share

నేలకొండపల్లి, ఆగస్టు 5 మహా:

అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు, రేషన్కార్డులు అందించాలని రాష్ట్ర రెవిన్యూ, గృహా నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కోరారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం పాలేరు డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మోటాపురం సోసైటీ మాజీ డైరెక్టర్ రావెళ్ల కృష్ణారావు కలిసి వినతి పత్రం ను అందించారు. మండలం లోని వివిధ గ్రామాలలో రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని కోరారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను అర్హత కలిగిన వారికి అందించాలని కోరారు. నేలకొండపల్లి లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ను తరలించకుండా కొనసాగించి..మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని కోరారు. అదే విధంగా వివిధ సమస్యల ను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. మంత్రి చొరవ తో పాలేరు లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు