కామేపల్లి,ఆగస్టు 5 మహా – నేటి సమాజం మత్తు ప్రపంచంలో మునిగిపోతుంది దానికి దూరంగా ఉండాలి అని జిల్లా ప్రోగ్రాం అధికారి రామారావు అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల నందు ఆశ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు వివరాలు అరా తిశారు నాన్ కమ్యూనికబుల్ డిసీస్ అనగా హైపర్ టెన్షన్ (BP), డయాబెటిక్ ( షుగర్) మరియు క్యాన్సర్ మీద పూర్తిగా అవగాహనకల్పించారు,సమాజంలో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విలువైన జీవితం మీద అవగాహన కలిగి చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు కృషి చేయాలని తెలిపారు,ఆశా మరియు నర్సు వైద్య సిబ్బందికి,ఈ సీజన్లో వచ్చే వ్యాధుల మీద అవగాహన కలిగి ప్రతిరోజు సర్వే చేయడం వలన డెంగు, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులను అరికట్టవచ్చునని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యురాలు డాక్టర్ శిరీష, జిల్లా ప్రోగ్రామ్ ఆధికారి దుర్గా,కే వెంకటేశ్వర్లు,హెచ్ ఈ ఓ, జె శ్రీనివాసరావు, రాధాకృష్ణ, నరేంద్రనాయక్ లక్ష్మి సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్పిస్ హెల్త్ అసిస్టెంట్స్ మేల్ అండ్ ఫిమేల్ మరియు ఆశాలు పాల్గొన్నారు







