మంచిర్యాల, మహా : విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం విద్యార్థులకు చేరువలో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరమ్మత్తులు అవసరం కలిగిన పాఠశాల భవనాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో రామ్ నగర్ లో గతంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలమైనందున, స్థానిక విద్యార్థులకు విద్యను అందించేందుకు నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.







