ఆదిలాబాద్ మహా : తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటానని జనం ఆశీస్సులతోనే ఇంతటి అభిమానాన్ని పొందగలిగాగని ఆదిలాబాద్ ముద్దబిడ్డ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని నియోజకవర్గ నలుమూలలనుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషుల మధ్య ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవాభవన్ లో జరిగిన జన్మదిన వేడుకలలో ఆయన తన సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి సమేతంగా పాల్గొని అందరి శుభాకాంక్షల వెల్లువల మధ్య భారీ కేక్ కట్ చేసారు. అంతకు ముందు అభిమానులు క్యాంపు కార్యాలయ ఆవరణలో కంది శ్రీనివాస రెడ్డి దంపతులను భారీ గజమాలతో సత్కరించారు. అశేషంగా తరలివచ్చిన శ్రేణులు పూలబొకేలు శాలువాలతో తమ అభిమాన నేత కంది శ్రీనివాస రెడ్డి దంపతులను సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజుకు తనపై అభిమానంతో ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు , అభిమానులకు కంది శ్రీనివాస రెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన జన్మదినాన్ని సేవాదినంగా పాటించి పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్ నియోజక వర్గ ప్రజల ఆశీస్సులతో ఇంత మంది ప్రజల అభిమానాన్ని సంపాదించడం తనకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. ఆను ఓడినా గెలిచినా ప్రజల మనిషినే అన్నారు. నియోజక వర్గ ప్రజలకు ఎవరికి ఎలాంటి అవసరమొచ్చిన నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. మనమంతా ఓ కుటుంబంలా కలిసి మెలసి అనుకున్న లక్ష్యాలను చేరుకుందామన్నారు. నాయకులు కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. ఇదే ఉత్సాహంతో రానున్న స్థానిక ఎన్నికలలో అంతా కలిసికట్టుగా పని చేసి పార్టీ అభ్యర్ధులను గెలిపించుకుందామన్నారు. తాను ఎల్లప్పుడూ మీ మనిషినే అని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎల్లకాలం ఇలాంటి ఆశీర్వాదం తనపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించి వారికి ఫౌండేషన్ తరపున ప్రశంసా పత్రాలు అందచేసారు. అనంతరం రిమ్స్ ఆవరణలోని గణేష్ మందిరాన్ని కంది శ్రీనివాస రెడ్డి దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు చేసారు. రిమ్స్ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. న్యూహౌజింగ్ బోర్డ్ కాలనీలో ఆయన అభిమానులు చేపట్టిన అన్నదానకేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







