హన్మకొండ మహా;
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరుసగా రెండవ రోజు హనుమకొండ రామ్ నగర్ లోని తమ నివాసంలో ప్రజల సమస్యలను తెలుసుకొని వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు రాంనగర్ లోని తమ నివాసానికి చేరుకుని తమ సమస్యలను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి విన్నవించారు. వారి సాధకబాధకాలను విని సంబంధిత అధికారులతో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. మరోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలకు వెనకాడనని కొండా మురళి స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారం దిశగా అధికారుల నుంచి సరైన స్పందన లేని పక్షంలో తనకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమేనని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కొండా మురళి తెలిపారు.
Post Views: 84







