సిపిఐ నేత బొల్లోజు అయోధ్య రోడ్ ప్రమాదంలో దుర్మరణం….
సూర్యాపేట వద్ద జరిగిన రోడ్ ప్రమాదం
ముందుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం …
సిపిఐ నేత ఉమ్మడి ఖమ్మం జిల్లా జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ ,సిపిఐ రాష్ట్ర నాయకులూ బొల్లోజు అయోధ్య రోడ్ ప్రమాదంలో దుర్మరణం…. బుధవారం ఉదయం సూర్యాపేట లోని తన కూతురు ఇంటివద్ద నుంచి హైద్రాబాద్ బయలుదేరారు … అంతకు ముందు రోజు రాత్రి ఆయన మణుగూరు నుంచి సూర్యాపేటలోని తన కూతురు వద్ద రాష్ట్ర బస చేసి ఉదయం 5 గంటల ప్రాంతంలో హైద్రాబాద్ బయలుదేరారు …కొద్దీ సేపటికే సూర్యాపేట వద్ద జరిగిన రోడ్ ప్రమాదం లో ఆయన మృతి చెందారు … ఆసమయంలో తన కారులో డ్రైవర్ తో మాత్రమే ఉన్నారు … ముందుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో కారు లారీని బలంగా ఢీకొట్టింది .. ఈ ప్రమాదంలో అయోధ్య అక్కడికక్కడే మరణించగా , డ్రైవర్ కు గాయాలైయ్యాయి…ఆయన భౌతిక ఖాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ..అనంతరం అక్కడ నుంచి సిపిఐ ఖమ్మం జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవన్ ప్రజల దర్శనార్థం కొద్దిసేపు ఉంచి ,అక్కడ నుంచి కొత్తగూడెంలో సిపిఐ కార్యాలయంలో కొద్దీ సేపు ఉంచిన అనంతరం తన సొంత ఊరు మణుగూరు తరలిస్తారు …మణుగూరులో అంత్యక్రియలు జరుగుతాయని సిపిఐ నేతలు తెలిపారు …
బొల్లోజు అయోధ్య సిపిఐ జిల్లా నేతల్లో కీలక నేతగా ఉన్నారు …మణుగూరు జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు …ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ కు వైస్ చైర్మన్ గా పనిచేశారు …మణుగూరు ,పినపాక ప్రాంతాల్లో పార్టీని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర అమోఘం …
అయోధ్య రోడ్ ప్రమాదంలో మరణించారన్న వార్త సిపిఐ శ్రేణులను దిగ్బ్రాంతికి గురిచేసింది …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తన కార్యక్రమాలను రద్దు చేసుకొని అయోధ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బయలుదేరారు …సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు , సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు భాగం హేమంతరావు , సిపిఐ ఖమ్మం ,కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు , దండి సురేష్ , సాబీర్ పాషాలు అయోధ్య మరణంపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు …







