కాటారం మహా :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచందర్ రావు గురువారం ఆకస్మిక బదిలీ అయ్యారు. సి ఐ మహాదేవపూర్ నుండి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. కొన్ని నెలలు మాత్రమే పని చేసిన సిఐ రామచంద్ర రావు ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కాలేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతి పుష్కరాల సమయంలో విధి నిర్వహణలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేకంగా సిఐ బదిలీకి ఒక్కరికే ఉత్తర్వులు వెలువడడం విశేషం.
Post Views: 56







