Mahaa Daily Exclusive

  నర్సరీల చట్టం ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి..!

Share

భూపాలపల్లి, మహా : నర్సరీల చట్టాన్ని ఉల్లంఘించి పంటల నారును పెంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎడ్ల సునీల్ కుమార్ హెచ్చరించారు. చిట్యాల మండలంలోని జూకల్,చల్లగరిగే గ్రామ శివారులలో అనుమతి పొందిన మిరప నర్సరీలను పరిశీలించారు. లైసెన్సుతో కూడిన నర్సరీలపై పర్యవేక్షణ మరింతగా బలపరచనుందని తెలిపారు. ముఖ్యంగా నర్సరీలో సస్యరక్షణ చర్యలు, నారు వయసు, అమ్మకాలు మొదలైన వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, మిరప నారును కేవలం 35 నుంచి 40 రోజుల వరకే పెంచాలనీ, అనంతరం వాటి ఉత్పత్తి వివరాలు నమోదు చేయాలనీ ఆయన సూచించారు.
జిల్లాలో ఈ సంవత్సరం 10 మిరప నర్సరీలకు లైసెన్సులు రెన్యూవల్ చేసినట్లు తెలిపారు. లైసెన్సుదారులు నర్సరీ చట్టం ప్రకారం విధిగా నిబంధనలు పాటించాలని, నర్సరీ నిర్వహణలో రిజిస్టర్లు తప్పనిసరిగా నిత్యము అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.