Mahaa Daily Exclusive

  నిర్మల్ జిల్లా లో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా హాస్పిట‌ళ్లు ఖానాపూర్ లో డీఎంహెవో త‌నిఖీలు ఓ క్లీనిక్ మ‌రో హాస్పిట‌ల్ సీజ్ .,.!

Share

ఆదిలాబాద్ మ‌హా : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులను నిర్మల్ జిల్లా వైద్యాధికారి రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి గీత క్లినిక్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం తనిఖీలు నిర్వహించగా, గీత క్లినిక్ యజమాని, యునాని డాక్టర్గా వ్యవహరిస్తున్నారని, లోపల మాత్రం వేరే రకమైన ఇంజక్షన్లు ఉన్నాయన్నారు. అలాంటివి ఆయన వాడకూడదని తెలియజేశారు. సూర్య ఆసుపత్రిలో ఎలాంటి అనుమతి పత్రాలు, డాక్టర్ లేకుండా, ఆస్పత్రిని నడిపిస్తున్నందుకు ఈ రెండింటిని సీజ్ చేశామన్నారు. ఇలాంటివి ఖానాపూర్ లో చాలా వరకు ఉన్నాయని మా దృష్టికి వచ్చిందన్నారు. వాటినీ కూడా పరిశీలిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.