తలమడుగు మహా:
రేషన్ కార్డ్ నిరంతర ప్రక్రియని ఎవరు ఆందోళన చెందద్దని అందరికీ లబ్ది చేకూరేలా కృషి చేస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో తలమడుగు మరియు తాంసి తాసిల్దారుల అధ్యక్షతన నిర్వహించిన వన మహోత్సవం, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజార్షి షా, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి లు హాజరై ముందుగా గౌడన్నలతో కలిసి అధికారులు ప్రజాప్రతినిధులు ఈత మొక్కలు నాటి వాటికి నీళ్లు అందించినారు. అనంతరం రైతు వేదికలో రెండు మండలాల నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ నాయకుడు మాట్లాడుతూ ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలతో పాటు పది సంవత్సరాల తరువాత ప్రజలకు రేషన్ కార్డుల పండగ ఈరోజు జరుగుతుందని స్టేజి మీద ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు పేద ప్రజలు కూడా సన్నబియ్యాన్ని తినాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మంచి నాణ్యత గల సన్నబియ్యాన్ని ప్రజలకు అందిస్తుందని అనడంతో పక్కన ఉన్న బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తులం బంగారం మరికొన్ని పథకాలు ఎటు వెళ్లాయని విమర్శించడంతో డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చి కావాలని లొల్లి చేయడం సరికాదన్నారు. కొన్ని రోజుల ముందు కూడా ఇలానే బిఆర్ఎస్ నాయకులు లొల్లి చేయడం జరిగిందని మాటలు జాగ్రత్తగా రావాలని మండిపడుతూ పోలీసులు రావాలని కోరిన వెంటనే కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇరు పార్టీల నాయకుల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది, పోలీసుల జోక్యంతో గందరగోళం సద్దుమణిగింది. భోజ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేకమైన సంక్షేమ పథకాలు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా చేస్తూ పోతుందని ఇకముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల వైపు నిలబడుతుందని అన్నారు. జిల్లా కేంద్రం నుంచి అయితే ఆదివాసి గూడాల వరకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల మంజూరు, మహిళకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, వేలాది సంఖ్యలో ఉద్యోగాలు కల్పించామని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా చీటికి మాటికి లొల్లి చేయడానికి చూస్తే బాగోదని హెచ్చరించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ మనకు లొల్లి చేయడం అవసరం లేదని ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇతర పార్టీల పేర్లు గాని పథకాల పేర్లు గాని తీసుకురావద్దని అన్నారు. గతంలో మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకువచ్చి,పేద ప్రజల అభివృద్ధికై కృషిచేసి రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నామని అన్నారు. డిసిసిబి చైర్మన్ మొన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పుడు ఏ పార్టీలో ఉండి ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలని లొల్లి చేసే అంత అవసరం లేదని ప్రజాప్రతినిధులుగా ప్రజలకు కావలసిన అవసరాలను తీర్చాలని అన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రజలకు అందిస్తుందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రేషన్ కార్డులు చేయిస్తామని ఎవరైనా అధికారులు, ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతే అడిగిన వారిని ఇచ్చిన వారిపై ఇద్దరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల బాగోగుల కోసం వారి బాధలను తీర్చడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం రెండు మండలాల లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డుల మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తలమడుగు తహసిల్దార్ రాజ్ మోహన్, తాంసి తాసిల్దార్ లక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ లు ప్రభాకర్, గణేష్ యాదవ్, ఆర్ ఐ రోహిదాస్, జూనియర్ అసిస్టెంట్స్ రాఘవేంద్ర, సాయిరాం అధికారులు ప్రజా ప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.







