Mahaa Daily Exclusive

  గేటు కారేపల్లికి చెందినప్రముఖ న్యాయవాది మృతి…!

Share

కారేపల్లి, మహా:సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది పరస అనంత నాగేశ్వరరావు(45) గుండెపోటుతో మరణించినాడు. వృత్తిరీత్య గురువారం ఉదయం హైకోర్టుకు వెళ్ళినారు. కోర్టులో కేసుల పరిశీ లనలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కోర్టు ప్రాంగణంలోని కుప్పకూలిపోయినాడు. తోటి లాయర్లు, సిబ్బంది హుటాహుటిన వైద్య నిమిత్తం తరలించాలని ప్రయత్నం చేయగా అప్పటికె మృతి చెందినాడని నిర్ధారణ అయింది. అనంత నాగేశ్వరరావు పుట్టుక ఉన్నత కుటుంబంలో పుట్టినా తర్వాత పరిస్థితిలు అనుకూ లించక కుటుంబం పూర్తిగా పేదరికంలోకి వెళ్ళినది. తండ్రి చదివించే పరిస్థితి లేకపోతే స్వతగా పార్ట్ టైం పని చేసుకుంటూ కష్టపడి చదివి లాయర్ పట్టా చేపట్టాడు. పెద్దల సూచన సలహాల ప్రకారం హైకోర్టులో సీనియర్ లాయర్ దగ్గరచేరి పూర్తి నైపుణ్యం నేర్చుకొని స్వతగా ప్రాక్టీస్ మొదలెట్టి అంచలంచలుగా ఎదిగి ప్రభుత్వ రెవెన్యూ లాయర్ గా మూడు సంవత్సరాలు పని చేశారు. గేట్ కారేపల్లి గ్రామంలో అందరితో సఖ్యతగా, అందరివాడిగా ఉంటూ అందరి మన్ననలు పొందాడు. నేడు ఆయన ఇక లేడు అని తెలియగానే గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని గ్రామస్తులంతా కోరుకున్నారు. ఆయనకు తల్లి, భార్య, తమ్ముడు, కొడుకు, కూతురు కలరు.