అశ్వారావుపేట, ఆగస్టు 10, మహా:
అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో అశ్వారావుపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విభజన గాయాల స్మృతి దినం మరియు హర్ ఘర్ తిరంగా మండల స్థాయి కార్యశాల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 14ను జాతీయ పార్టీ ఆదేశాల మేరకు విభజన గాయాల స్మృతి దినంగా పాటించాలన్నారు. దేశ విభజన సమయంలో వేలాది హిందువులు ప్రాణాలు కోల్పోయిన త్యాగాలను ప్రజలకు వివరించి, వారి త్యాగాలను స్మరించాలన్నారు.
ఆపరేషన్ సింధూర్ ను గుర్తుచేస్తూ, జమ్మూ-కాశ్మీర్ పహాల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను, భారత సైన్యం ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి వీర పరక్రమాలను ప్రపంచానికి చాటిందని అన్నారు. ఈ విజయాలు ప్రజలకు తెలియజేసేలా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.
ఆగస్టు 15న ప్రతి ఇంటిపై, ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేయడానికి బిజెపి బూత్ స్థాయి, మండల స్థాయి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ఆగస్టు 13న యువమోర్చా ఆధ్వర్యంలో మండలవ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించి, స్వాతంత్ర ఫలాలు, సైన్యం యొక్క శౌర్య గాథలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మెట్ట వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శులు రాయుడు ఆంజనేయులు, పమిడి లక్ష్మీనారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎస్విటి కొండ, మండల ఉపాధ్యక్షులు నైనవరపు రాజేష్, మండల కార్యదర్శులు శీమకుర్తి తాతా శ్రీనివాసరావు, మేడవరపు కృష్ణ చైతన్య, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు రావిక్రింది కుమార్ రాజా, బుడిపుటి శ్రీను, శీమకుర్తి సుబ్బారావు, పెదమళ్ళ పుల్లారావు, వేముల శ్రీను, తానికొండ రాంబాబు, మహేష్, నడిపల్లి చందు, పాండ్రంకి కనకరాజు, మహిళా మోర్చా నాయకులు బాణాల సునీత, పచ్చినీల సుమలత, వారా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.







