Mahaa Daily Exclusive

  మండలం లో మాజీ ఎమ్మేల్యే కందాళ పర్యటన..!

Share

నేలకొండపల్లి, ఆగస్టు 10 మహా:

పాలేరు మాజీ ఎమ్మేల్యే కందాళ ఉపేందర్రెడ్డి మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం పర్యటించారు. ముజ్జుగూడెం, నేలకొండపల్లి తదితర గ్రామాలలో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు. మృతుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. పలు వివాహా వేడుకలలో పాల్గొని నూతన వధువరులను ఆశ్వీరదించారు. అనంతరం కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడారు… ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య. సోసైటీ చైర్మన్ లు నాగుబండి శ్రీనివాసరావు, కోటి సైదారెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, నాయకులు మరికంటి రేణుబాబు, షేక్ హుస్సేన్, కమదన ప్రవీణ్, యలమంద, మాదాసు ఆదాం. సిద్దయ్య కుక్కల సామేల్, అనగాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు