కారేపల్లి, మహా: సింగరేణి మండల పరిధిలోని లింగం బంజరలో ఆదివారం గంగమ్మ తల్లి గుడి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఆ గ్రామానికి చెందిన రేళ్ల సత్యనారాయణ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని వితరణగా ఇచ్చారు.ప్రముఖ పురోహితుడు గోదావరి ఈశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో బంజర తుమ్మలకుంట ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న గంగమ్మ తల్లి గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ తల్లి గుడి చైర్మన్ పురం అంజయ్య, కమిటీ సభ్యులు బడుగుల శీను,పురం రామరాజు,బడుగుల చిన్న లింగయ్య,భాష్యం కృష్ణ,భాష్యం రామారావు,మొగిలిచర్ల రాంబాబు,యాదవ కుల సంఘం పెద్దలు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post Views: 110







