Mahaa Daily Exclusive

  భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ తల్లికి బోనాలు ..!

Share

జూలూరుపాడు, ఆగస్టు 10, (మహా): మండల పరిధి అనంతారం గ్రామంలో ఆదివారం గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతోటి ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. డప్పుల దరువుల తోటి మహిళలు, పిల్లలు బోనం ఎత్తగా, పురుషులంతా కోళ్లు, యాటపోతులు, ఆటపాటలతో కోలాహాలంగా ఊరేగింపుగా అమ్మవారి గుడి కి చేరుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు సమర్పించారు. వర్షాలు సమయానుకూలంగా కురిసి పంటలు బాగా పండాలని, పాడి పశు సంపద వృద్ధి చెందాలని, గ్రామస్తులంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉద్యోగులు, మహిళలు, యువకులు, పిల్లలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.