మందమర్రి, మహా : మందమర్రి ఏరియాలోని వివిధ గనులు, డిపార్ట్ మెంట్ లలో నేటి నుండి 8 రోజులపాటు మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మందమర్రి జిఎం జి దేవేందర్ వెల్లడించారు. సోమవారం జిఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐఈడి (ఎస్సీ) కిరణ్ కుమార్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సీనియర్ పిఓ బొంగోని శంకర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ 12 ఆగస్టు నుండి 20 ఆగస్టు వరకు గనులు, డిపార్ట్మెంట్లలో మల్టీ డిపార్ట్ మెంట్ సమావేశాలు అధికారులతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2024-25 సంవత్సరంలో కంపెనీ సాధించిన అంశాలు, 2025-26 సంవత్సరంలో కంపెనీ లక్ష్యాలు సాధించిన వివరాలు,భూగర్భ గనుల యంత్రముల వినియోగం.
ఉద్యోగుల అటెండెన్స్,సింగరేణి సంస్థలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కార్మికులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, ముందున్న సవాళ్లు, కంపెనీ లక్ష్యాలను సాధించడానికి మన ప్రణాళికలు తదితర అంశాల గురించి చెప్పుతూ, కార్మికుల నుండి సూచనలు తీసుకుంటామని జి ఎం దేవేందర్ స్పష్టం చేశారు.







